MDK: చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మఠం జస్వంత్ (18) అని యువకుడు డిగ్రీ చదువుతున్నారు. మంగళవారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.