దేశంలో క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగింది. గత అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డుల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 2.14 లక్షల కోట్లు ఖర్చు చేశారు. పోయిన ఏడాది(రూ.1.79 లక్షల కోట్లు)తో పోలిస్తే, ఇది ఏకంగా 19.6 శాతం ఎక్కువ. దీనికి ప్రధాన కారణం పండగల సీజన్ కావడమే. పండగల సమయంలో ఆన్లైన్ షాపింగ్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లు ఉండటంతో ప్రజలు భారీగా ఖర్చు చేశారు.