ATP: ప్రజలందరికీ భాగస్వామ్యంతో వారసత్వ కట్టడాల పరిరక్షణ చేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలలో నిర్వహించిన ప్రపంచ వారసత్వ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వారసత్వ కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.