ATP: గుంతకల్లులో మై భారత్ అనంతపురం జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సర్దార్ @150 ఏకతా పాదయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మండల ఇంఛార్జ్ నారాయణస్వామి, ఆ నలుగురు సేవాసమితి సభ్యులు మంజుల వెంకటేష్, సీఐ మనోహర్ హాజరయ్యారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.