VKB: బడి బయటి పిల్లలపై రేపటి నుంచి సర్వే యాలాల మండలంలో బడి బయట ఉన్న బాలలు ఎంతమంది ఉన్నారనే అంశంపై ప్రభుత్వ పాఠశాలల క్లస్టర్ల పరిధిలో రేపటి నుంచి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. MRCలో పనిచేసే సీఆర్పీల ఆధ్వర్యంలో ఈ సర్వే కొనసాగనుంది. సర్వే వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 31వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు.