కడప నగరంలో వందల కోట్ల విలువైన ట్రస్ట్ భూమిని టీడీపీ నేతలకు దేవాదాయ శాఖ వేలం వేయడాన్ని నిరసిస్తూ మంగళవారం వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పేదల కోసం ఉద్దేశించిన భూమిని వాణిజ్య సముదాయాల నిర్మాణాలకు కేటాయించడాన్ని నాయకులు ప్రశ్నించారు. నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులకు, వైసీపీ నేతలకు వాగ్వాదం జరిగినట్లు సమాచారం.