NLG: గురు తేజ్ బహదూర్ సాహిబ్ జీ 350వ వర్ధంతిని చిట్యాల లోని గురుద్వారాలో మంగళవారం నిర్వహించారు. శిక్కులు శబద్ బాణీ, కీర్తనలు, భజనలు చేసి నివాళులు అర్పించారు. అనంతరం గురు ధర్మ ప్రచార పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు బహదూర్ సింగ్ మాట్లాడుతూ… కాశ్మీరీ పండిట్ల మతమార్పిడిని వ్యతిరేకించగా ఔరంగజేబు బహిరంగంగా తల నరికించాడని, అతని ప్రాణ త్యాగాన్ని కొనియాడారు.