ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో తీవ్రంగా గాయపడిన శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ తాను జిమ్లో వ్యాయామాలు చేస్తున్న ఫొటోను స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో అతడు త్వరలోనే తిరిగి భారత్ జట్టులో చేరే అవకాశం ఉంది. ఇది టీమిండియాకు గూడ్న్యూస్గా చెప్పవచ్చు.