VSP: టీడీపీ విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి, తక్షణమే అరెస్టు చేయాలని సమాజవాద పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురవయ్య యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 2న గాజువాకలో అనంతలక్ష్మి చేసిన దాడి కేసులో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు.