NLG: చిట్యాల మండలం ఏపూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మంగళవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘బేటి బచావో బేటి పడావో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలికల విద్య, బాల్య వివాహాల నిర్మూలన, సైబర్ నేరాలు, ఆన్లైన్ గేమింగ్, గంజాయి మత్తుపదార్థాల వల్ల అనర్ధాలు, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, 100 గురించి అవగాహన కల్పించారు. సీడీపీవో లావణ్య, హెచ్ఎం మోహన్ రెడ్డి పాల్గొన్నారు.