ప్రకాశం: గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మంగళవారం అధికారులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా PMAY (గ్రామీణం) సర్వే పురోగతిని సమీక్షించిన ఎమ్మెల్యే సర్వే పనిలో ఎలాంటి ఆలస్యం జరగకుండా అధికారులు కఠినంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి నివాసహీన పేద కుటుంబం తప్పక సర్వేలో చేర్చబడాలని స్పష్టం చేశారు.