E.G: రాజమండ్రి నగరం ఏవి అప్పారావు రోడ్డు శివాలయం వద్ద ఉచిత దర్శనం టికెట్ల కోసం భక్తులు బారులు తీరారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మహిళలు, చిన్నారులు కిలోమీటర్ మేర క్యూ లైన్లో సాయంత్రం ఇచ్చే టికెట్ల కోసం నిలబడి వేచియున్నారు. రేపు శివాలయం వద్ద సుబ్రహ్మణ్య షష్టి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ల కోసం రద్దీ ఏర్పడింది.