NDL: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రేపు సున్నిపెంటలో అంబేద్కర్ సెంటర్లో నిర్వహించే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గొట్టేముక్కల ప్రకాష్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమంలో దళిత ప్రజా కార్మిక, కుల సంఘాల నాయకులు, ప్రజలు, మేధావులు, యువకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.