NLG: చందంపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన TGSRTC వారి భారత్ పెట్రోలియం బంక్‌ను ప్రారంభించినట్లు దేవరకొండ ఆర్టీసీ డిపో ఇంఛార్జ్ డిపో మేనేజర్ పడాల సైదులు మంగళవారం తెలిపారు. మండలంలోని పరిసర గ్రామ వాహనదారులు, వ్యవసాయదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలతో పెట్రోల్, డీజిల్ అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.