ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి రాప్తాడు మండలం హంపాపురం సమీపంలో ఉన్న మౌనగిరి హనుమత్ క్షేత్రాన్ని సందర్శించారు. దక్షిణ భారతదేశంలోనే ఎత్తయిన (39 అడుగులు) ఏకశిలా విగ్రహం రూపంలో కొలువై ఉన్న ఆంజనేయ స్వామికి ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.