ASR: అరకులోయ మండలం బస్కి పంచాయతీ పరిధిలోని, కంజరిటోట గ్రామం అంగన్వాడీ కేంద్రంలో కుల్లి పోయిన గుడ్లు పెడుతున్నట్టు స్థానికులు తెలిపారు. కాలం చెల్లిన గుడ్లు తినడం వల్ల గర్భిణీలు, బాలింతలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు స్పందించి నాసిరకం గుడ్లు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.