భూపాలపల్లి మండలంలోని పంబాపూర్ భీమ్ ఘనపూర్ పెద్ద చెరువులో MLA గండ్ర సత్యనారాయణరావు ఇవాళ చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా MLA గండ్ర మాట్లాడుతూ.. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మత్స్యకారులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.