MDK: వెల్దుర్తి మండలం మన్నె వారి జలాల్ పూర్ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో 60 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు రెవిన్యూ అధికారులు తెలిపారు. గ్రామానికి చెందిన కమ్మరి ఎరుకమ్మ నివాసంలో మంగళవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఇంట్లోని బట్టలు, వంట సామాగ్రి, నిత్యవసర సరుకులు, ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు బాధితులు చెప్పారు.