NDL: పాముల పాడు మండలం, జూటూరు గ్రామంలో ఇవాళ రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్నికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరై, ఇంటింటి కి తిరిగి కూటమి ప్రభుత్వం రైతు ఖాతాలలో జమ చేసిన రైతు భరోసా వివరాలు గురించి వివరించారు. అనంతరం కరపత్రాల పేపర్లను పంపిణీ చేశారు. గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.