ఆదోని జిల్లా ఏర్పాటుయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని జిల్లా సాధన సమితి నాయకులు పేర్కొన్నారు. కాగా ఈ ఉద్యమానికి యూటీఫ్ సీనియర్ నాయకుడు కృష్ణమూర్తి సంఘీభావం తెలిపారు. ఆదోని జిల్లా సాధన కోసం ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు గళమెత్తి ఆదోని ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని, అప్పుడే జిల్లా సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు.