టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 220/4 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు ఆధిక్యం 508 పరుగులకు చేరింది. స్టబ్స్ (60*), ముల్దర్ (29*) క్రీజులో ఉన్నారు. మరోవైపు నాలుగో రోజు కూడా భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు.