ADB: ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పాయల శంకర్ పేర్కొన్నారు. పట్టణంలోని శాంతినగర్లో నిర్వహిస్తున్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాలనీవాసులతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో BJP నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.