మనచుట్టూ కొందరు బానిస భావజాలం ఉన్న వారు ఉన్నారని ప్రధాని మోదీ తెలిపారు. బానిస భావజాలం ఉన్న వ్యక్తులకు చోటు ఇవ్వొద్దన్నారు. ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లని.. శతాబ్దాల క్రితమే భారత్లో ప్రజాస్వామ్యం ఉందని చెప్పారు. తమిళనాడు ఉత్తర మేరూర్ శాసనం ప్రజాస్వామ్యం గురించి చెప్తోందని పేర్కొన్నారు. భారత్లోని ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో రాముడు ఉన్నాడని స్పష్టం చేశారు.