అయోధ్య రామాలయంపై ఏర్పాటు చేసిన ధర్మధ్వజం శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందని ప్రధాని మోదీ అన్నారు. ‘ఈ ధర్మధ్వజం ప్రపంచానికి ఒక స్ఫూర్తి, ప్రేరణను ఇస్తుంది. కర్త, కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని చెప్తుంది. పేదలు, దుఃఖితులు లేని సమాజాన్ని మనం ఆకాంక్షిస్తున్నాం. ఈ ధ్వజాన్ని దూరం నుంచి చూసినా రాముడిని చూసినంత పుణ్యం వస్తుంది’ అని పేర్కొన్నారు.