BDK: చుంచుపల్లి మండలంలోని పెనగడప గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. రైతులు పండించే ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుత సీజన్లో వరి సన్న రకం ధాన్యానికి మద్దతు ధరగా రూ. 2,389 నిర్ణయించి అదనంగా బోనస్ రూ. 500 చెల్లిస్తుందన్నారు.