నెల్లూరు స్వర్ణాల చెరువులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మీనోత్సవం కార్యక్రమం జరిగింది. చెరువులో RDO అనూషతో పాటు టీడీపీ నేత గిరిధర్ రెడ్డి చేప పిల్లలను వదిలారు. గత ఏడాది 8 లక్షల చాప పిల్లలను స్వర్ణాల చెరువులో వదలడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతం కంటే మిన్నగా ఈ ఏడాదికి గాను 13 లక్షల చేప పిల్లలను వదిలేందుకు కోరారు.