KDP: కమలాపురం నగర పంచాయతీ పరిధిలో వీధి కుక్కల సంఖ్యను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కమిషనర్ ప్రహ్లాద్ తెలిపారు. పట్టించిన కుక్కలకు స్టెరిలైజేషన్ శస్త్రచికిత్స, రేబీస్ టీకాకరణతో పాటు మగ కుక్కలకు జనన సామర్థ్యాన్ని తగ్గించే ప్రత్యేక కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని అన్నారు.