AP: మద్యం కేసులో ఏ38గా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని జైలు అధికారులు చికిత్స కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రెండ్రోజులుగా తన కాళ్లు వాపు వస్తున్నాయని, వెరికోస్ వీయిన్స్ ఉందని జైలు అధికారులతో చెవిరెడ్డి చెప్పారు. దీంతో ఎయిమ్స్ నుంచి అధికారిక అనుమతి రావడంతో ఇవాళ ఉదయం విజయవాడ జైలు నుంచి చెవిరెడ్డిని ఎయిమ్స్‌కు తరలించారు.