మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో ఎమ్మెల్యే యశస్వి రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మండల కేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తోరూర్ మండలంలోని అమ్మపురం పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొననున్నారు.