ATP: ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మంగళవారం జిల్లా కలెక్టర్ ఆనంద్‌ను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. అరటి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దళారుల మోసాలను వివరించి, సరైన ధరలు నిర్ణయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, కసాపురం నుంచి గుంతకల్లు రోడ్డు వరకు బైపాస్ నిర్మాణం, డీఎంఎఫ్, నరేగా నిధులతో గ్రామీణ రోడ్ల అభివృద్ధిపై చర్చించారు.