NDL: బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవలాపురం గ్రామంలో సోమవారం రాత్రి ఏ.దేవి వెంకటరమణ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి మంటలు చెలరేగాయి. ఫ్రిడ్జ్ నుంచి పొగ మంటలు రావడం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై బయటికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. ఫ్రిడ్జ్ పేలడానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుగుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.