KMM: ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించి ఈ పథకాన్ని పునరుద్ధరించిందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని 19,670 మహిళా స్వయం సహాయక సంఘాలకు నేడు రూ. 19.27 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మధిర నియోజకవర్గంలో 4,782 సంఘాలకు రూ. 4.99 కోట్లు పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు.