సత్యసాయి: హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి మంగళవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అభివృద్ధి జరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎంపీ తెలిపారు.