KMM: ప్రభుత్వ విధులను అధికారులు జవాబుదారీతనంతో పకడ్బందీగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజావాణికి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.