యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు, పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ పురోహితులు మంత్రికి వేద ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అభివృద్ధి పనుల గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.