RR: షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బాల్యవివాహాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సూపర్వైజర్ జయలక్ష్మి మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, సమాజం బాధ్యతగా భావించి ఇలాంటి ఘటనలు జరగకుండా ముందుకు రావాలన్నారు. బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.