MHBD: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఇటీవల నియమితులైన డాక్టర్ భూక్యా ఉమా మురళి నాయక్‌ను సోమవారం యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను శాలువాతో సన్మానించి, పూలమొక్క అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జిలుగుల భాస్కర్, అఖిల్ తదితర యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.