MNCL: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు ఎంతో అన్యాయం జరుగుతుందని AITUC యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బెల్లంపల్లి శాంతిఖని గని అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ మంతెన రమేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి గని మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.