KMM: చేనేత వస్త్రాలకు ఆదరణ కల్పించేందుకు రూపొందించిన చేనేత లక్ష్మి పొదుపు స్కీంను ప్రజలందరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఇవాళ కలెక్టరేట్లో చేనేత లక్ష్మీ పథకంపై జిల్లా అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టెస్కో షో రూమ్ ద్వారా బట్టలు కొనుగోలు చేయడం వల్ల చేనేత కార్మికులకు ఎంతో మేలు చేయగలుగుతామని పేర్కొన్నారు.