తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావాల్సినదానికన్నా.. ముందుగానే వచ్చే అవకాశం ఉందని గత కొంతకాలంగా వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో… బండి సంజయ్.. తమ పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… సిద్ధంగా ఉండాలని ఆయన తమ పార్టీ నేతలకు సూచించారు. ఇక ఎవరికి టికెట్ ఇస్తారు అనే విషయం మాత్రం తన చేతిలో లేదని… జాతీయ నాయకత్వానిదే ఫైనల్ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. లాబీయింగ్ చేసి టైం వృధా చేసుకోవద్దని సూచించారు. కష్టపడి పనిచేస్తూ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేసే టోళ్లకే టిక్కెట్లు దక్కుతాయని క్లారిటీ ఇచ్చారు.
కేసీఆర్ స్ట్రాటజీ ఎట్లుంటదో తనకు తెలుసని, కేసీఆర్ ఎత్తులను ధీటుగా ఎదుర్కోవడంవల్లే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ప్రత్నామ్యాయమైందని బండి సంజయ్ వివరించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నేతలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ఉధృత పోరాటాలు చేయండని కార్యకర్తలకు, నేతలకు పిలపునిచ్చారు.