GDWL: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. సోమవారం అయిజ మండలం ఉప్పల గ్రామంలోని రైతు వేదిక కార్యాలయంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు కష్టపడి పండించిన పంటను మధ్య దళారులకు విక్రయించి మోసపోవద్దని పేర్కొన్నారు.