సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో గల ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సరైన వైద్యం అందించక భార్య సుజాత మృతి చెందిందని భర్త నరేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. మరణించిన సుజాత మృతదేహాన్ని తనకు సమాచారం ఇవ్వకుండా అంబులెన్స్‌లో ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు డాక్టర్ రాజ్‌కుమార్‌పై ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.