HYD: నార్సింగిలో మాదాపూర్ SOT రైడ్స్ నిర్వహించారు. ఈ దాడుల్లో 4.5 గ్రాముల హెరాయిన్ పట్టుబడింది. మై హోమ్ అవతార్ లేబర్ క్యాంప్ వద్ద అమ్మకానికి ప్రయత్నిస్తున్న దాల్మియా, లక్కన్ బర్మా అనే ఇద్దరు వెస్ట్ బెంగాల్ వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ మీద NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.