SKLM: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచి క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఆలయానికి రూ.7.67 లక్షల ఆదాయం వచ్చిందని ఈవో ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.