కృష్ణా: రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన మహోత్సవం విజయవాడ తాడిగడపలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. గుడివాడ మాంటిసోరి హైస్కూల్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు సయ్యద్ యాకుబ్ పాషాను మంత్రి పార్థసారథి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.