పార్వతీపురం మండలం ములగ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పరదేశమ్మ అమ్మవారిని మాజీ శాసనసభ్యులు జోగారావు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అందరూ బాగుండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ములగ పంచాయితీ సర్పంచ్ మడక కృష్ణవేణి, మాజీ సర్పంచ్ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మడక విశ్వనాథం పాల్గొన్నారు.