NZB: మాస్టర్ స్పోర్ట్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్లో అథ్లెట్ పోటీలు నిర్వహించారు. నవీపేట్ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన సాయిలు 5KM వాక్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. సాయిలు ప్రస్తుతం కాకతీయ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయనను పాఠశాల యాజమాన్యం అభినందించారు.