VZM: రామతీర్థం ఆలయాన్ని ఎమ్మెల్యే లోకం మాధవి ఆదివారం సందర్శించారు. ఆలయ పరిసరాలు చెత్త చెదారాలు పేరుకుపోయి, అపరిశుభ్ర వాతావరణం ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు మంచినీరు అందకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ వాటర్ ట్యాంకర్ తెప్పించి, మంచి నీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పారిశుధ్య సిబ్బంది అన్న ప్రసాద వితరణ ఎలా చేస్తారన్నారు.