MDK: నర్సాపూర్ నియోజకవర్గం మంత్రి వివేక్ వెంకటస్వామి రాయరావ్ చెరువులో ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. నర్సాపూర్ శాసనసభ పరిధిలోని 108 మత్స్య పారిశ్రామిక సంఘాల 5,668 మంది సభ్యులకు జీవనోపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. ఈ చెరువులో మొత్తం 93,500 చేప పిల్లలు వదిలినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.