GDWL: మగవారికి చేసే వ్యాసెక్టమీ సురక్షితమైన ఆపరేషన్‌పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందిని డీఎంహెచ్‌వో సిద్దప్ప పేర్కొన్నారు. శనివారం గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రసూన రాణి ఆధ్వర్యంలో ఆయన మాట్లాడుతూ.. వ్యాసెక్టమీ అనేది కోత, కుట్టు లేకుండా చేసే సురక్షితమైన ఆపరేషన్ అన్నారు.